70 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన గద్దర్

  • తొలిసారి ఓటు వేసిన ప్రజా గాయకుడు
  • సికింద్రాబాద్ ఆల్వాల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న గద్దర్
  • ఓటు అనేది రాజకీయ పోరాట రూపమంటూ వ్యాఖ్య
ప్రజా గాయకుడు గద్దర్ తన జీవితంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి, గొప్ప అనుభూతిని పొందారు. గద్దర్ తో పాటు ఆయన భార్య కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ ఆల్వాల్ పరిధిలోని భూదేవినగర్ లో 70 ఏళ్ల వయసులో ఆయన తొలిసారి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు అనేది రాజకీయ పోరాట రూపమని చెప్పారు. ఓట్ల యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఓట్ల విప్లవం వర్ధిల్లాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి, మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు.
Go Back to Shorts
gaddar
vote
secunderabad

More Telugu News