ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన రాం చరణ్.. !
- విదేశాల్లో ఉన్న రాం చరణ్
- అందుకే రాలేకపోయాడన్న చిరంజీవి
- ఓటేయకుంటే ప్రశ్నించే హక్కు ఉండదన్న మెగాస్టార్
రాం చరణ్ ఎందుకు ఓటేయలేకపోయాడనే విషయాన్ని చిరంజీవి విలేకరులకు వివరించారు. రాం చరణ్ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, అందుకే రాలేకపోయాడని వివరించారు. తాను మాత్రం ఉదయాన్నే భార్య, కుమార్తెలతో కలిసి వచ్చి ఓటు వేశానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అది వారి ధర్మమని చిరు అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటేయాలని, లేదంటే ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోతామని అన్నారు.