షూటింగ్ పూర్తయింది.. ఓటుకు నేను సిద్ధం.. మీరూ సిద్ధమేనా?: రాజమౌళి
Add ap7am to your home Screen

షూటింగ్ పూర్తయింది.. ఓటుకు నేను సిద్ధం.. మీరూ సిద్ధమేనా?: రాజమౌళి

  • ‘ఆర్ఆర్ఆర్’ తొలి షెడ్యూల్ పూర్తయింది 
  • ఓటు వేసేందుకు వెళుతున్నా
  • రేపు కచ్చితంగా ఓటు వేయండి
‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి మరో మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్ శివారులో వేసిన సెట్‌లో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ నేటితో పూర్తయిందని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ పూర్తయిందని, తాను ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళుతున్నానని.. అభిమానులను కూడా ఓటు వేయాలని కోరారు. ‘‘ఆర్‌ఆర్ఆర్’ తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు నేను ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వెళ్తున్నాను. మరి ఓటు వేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..? ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మన భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ గౌరవాన్ని స్వీకరిద్దాం. రేపు కచ్చితంగా ఓటు వేయండి’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
Bahubali
RRR
NTR
Ramcharan
Rajamouli
Hyderabad

More Telugu News