పవన్ కల్యాణ్ సినిమాల్లో బాగా నటిస్తాడా? లేక నిజజీవితంలోనా?: విజయసాయిరెడ్డి సెటైర్లు
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ సినిమాల్లో బాగా నటిస్తాడా? లేక నిజజీవితంలోనా?: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ట్విట్టర్ లో విమర్ళలు గుప్పించిన నేత
  • జనసేనాని నేలపై కూర్చున్న మెమె పోస్ట్
  • ఏ, బీ రేటింగ్ ఇవ్వాలని కోరిన సాయిరెడ్డి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో కన్నా నిజజీవితంలోనే ఎక్కువగా నటిస్తాడని విమర్శించారు.

ఈ సందర్భంగా అత్తారింటికి దారేది సినిమాలో ఓ ఫొటో క్లిప్ ను.. ఇటీవల పోరాటయాత్రలో భాగంగా ఓ కుటుంబంతో జనసేనాని నేలపై కూర్చుని మాట్లాడుతున్న ఫొటోతో కలిపి తయారుచేసిన మెమెను సాయిరెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

అనంతరం ‘పవన్ సినిమాల్లో బాగా నటిస్తున్నాడా? లేక నిజజీవితంలో బాగా నటిస్తున్నాడా? అన్నది చెప్పాలని ప్రజలను కోరారు. సినిమాల్లో బాగా నటిస్తే ‘ఏ’ అనీ, నిజజీవితంలో బాగా నటిస్తే ‘బీ’ అని రేటింగ్ ఇవ్వాలని కోరారు.
Pawan Kalyan
Jana Sena
movies
real life
Vijay Sai Reddy
YSRCP
criticise
Twitter

More Telugu News