మొదటిసారిగా థ్రిల్లర్ నేపథ్యంలో నాని

నాని ఈ సారి పూర్తి విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు .. అదీ 'జెర్సీ' సినిమా కోసం. ఈ సినిమాలో ఆయన క్రికెటర్ గా కనిపించనున్నాడు. తొలిసారిగా క్రీడా నేపథ్యంలో ఆయన చేస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం క్రికెట్ లో నాని కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక తొలిసారిగా నాని థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా కూడా చేస్తుండటం విశేషం.

తన తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఇటీవల ఆయనే స్వయంగా చెప్పాడు. దాంతో ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుందా? అని అంతా అనుకున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందనేది తాజా సమాచారం. అనూహ్యమైన మలుపులతో కొనసాగే ఈ కథలో మహిళలకు సంబంధించిన మంచి మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది. కథానాయికలు ఎవరనే  విషయమే బయటికి రావలసి వుంది.   
Go Back to Shorts
nani
vikram kumar

More Telugu News