లగడపాటి సర్వే.. గెలిచే మూడో అభ్యర్థి ఇతనేనా?
- చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్
- చిన్న వయసులోనే ప్రజాభిమానాన్ని చూరగొన్నావంటూ అభినందనలు
- మూడో గెలుపుగుర్రం మేడిపల్లేనంటూ జోరుగా చర్చ
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్ చేశారట. చిన్న వయసులోనే ప్రజాభిమానాన్ని చూరగొన్నావని అభినందిస్తూ... తన సర్వే వివరాలతో పాటు సత్యంకు ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పారట. దీంతో, లగడపాటి సర్వేలో మూడో గెలుపు గుర్రం మేడిపల్లి సత్యమే అనే చర్చ జోరుగా సాగుంతోంది. మరో విషయం ఏమిటంటే... ఉద్యమకాలంలో లగడపాటి, మేడిపల్లి సత్యంలు హోరాహోరీ తలపడ్డారు.