పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలి.. ఎవరి ఒత్తిళ్లకు భయపడం: చంద్రబాబు

01-12-2018 Sat 19:29 | Telangana
  • టీడీపీకి కంచుకోట కూకట్ పల్లి
  • నాడు కూకట్ పల్లిని ఎంతో అభివృద్ధి చేశాం
  • హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా చేసింది టీడీపీయే
తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలని, ఎవరి ఒత్తిళ్లకు తాము భయపడే పరిస్థితి లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కూకట్ పల్లిలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, టీడీపీకి కంచుకోట కూకట్ పల్లి అని, ఒకప్పుడు కూకట్ పల్లిలో నీళ్లు కూడా వచ్చేవి కాదని, అటువంటి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసింది తన హయాంలోనే అని అన్నారు.

‘నేను నా జీవితంలో చాలాసార్లు కూకట్ పల్లికి వచ్చాను కానీ, ఈరోజున మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఆవేశాన్ని నేను చూడలేదు. ఎందుకు వచ్చారని నన్ను టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే వారి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అవునా? కాదా? తమ్ముళ్లూ’ అంటూ ఉత్సాహపరిచారు. యువత అంతా చాలా కసిగా ఉన్నారని, వీళ్లందరూ ఈరోజున ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే అందుకు కారణం టీడీపీయేనని అన్నారు. ఈ విషయం నిజమే అయితే, గట్టిగా చప్పట్లు కొట్టాలని, ఆ చప్పట్లు కేసీఆర్ కు వినపడాలనడంతో కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

హైదరాబాద్ లో నాలుగు బిల్డింగ్ లు కడితే అయిపోయిందా? అంటూ ఓ నాయకుడు తనపై విమర్శలు చేశారని, ప్రపంచ పటంలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా చేసింది టీడీపీయే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని,  సైబరాబాద్ ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు బదులిచ్చారు. ఇందులో కేసీఆర్ పాత్ర ఏమైనా ఉందా? ఆయన ప్రమేయం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. నాడు తన పాలన తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో హైదరాబాద్ ఒక మహానగరంగా తయారైందని అన్నారు. 
ChandrababuTelugudesamkukatpalliroad show

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more