నేవీ కమాండర్ నిర్వాకం.. పోర్న్ యాప్ లో భార్య ఫొటోలనే అప్ లోడ్ చేసిన వైనం!
- పోర్నోగ్రఫీకి అలవాటు పడిన భర్త
- ఫోన్లో భార్య అభ్యంతరకర ఫోటోలు
- పోలీసులకు ఫిర్యాదు
అయినా అతడిలో మార్పు రాకపోవడంతో గత నెలలో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఢిల్లీ నుంచి ఆమె వస్తూ వస్తూ భర్త సెల్‌ఫోన్‌ను తీసుకొచ్చేసింది. ఆ ఫోన్‌ను పరిశీలించగా తన అభ్యంతరక ఫోటోలను చూసి షాక్ అయ్యింది. వెంటనే పుణె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తన అభ్యంతరకర ఫోటోలతో పాటు, కొలీగ్ భార్య, మరికొందరి ఫోటోలను యాప్‌లో అప్లోడ్ చేశాడని ఫిర్యాదులో ఆమె వెల్లడించింది. నేవీ కమాండర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు.