‘2.ఓ’ను ముందే హెచ్చరించినట్టుగా... లీక్ చేసిన 'తమిళ రాకర్స్'
- లీక్ చేసి తీరుతామని తమిళ రాకర్స్ సవాల్
- విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ
- సోషల్ మీడియాలో పైరసీ లింక్స్
‘2.ఓ’ చిత్రం విడుదలై కొన్ని గంటలు కూడా గడవక ముందే పైరసీ లింకులు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుండటంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమా ఓపెనింగ్స్ పరంగా అద్భుత వసూళ్లను సాధించినప్పటికీ పైరసీ ప్రభావాన్ని తట్టుకుని ఇకముందు నిలబడగలదా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాకు ప్రాణం గ్రాఫిక్సే కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్‌లోనే చూసేందుకు ఇష్టపడతారు కాబట్టి పైరసీ ప్రభావం చిత్రంపై పెద్దగా ఉండదనే మరో వాదన కూడా వినిపిస్తోంది.