డిసెంబర్ 2 నుంచి కేసీఆర్ తదుపరి ప్రచార షెడ్యూల్ వివరాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ 2 నుంచి కేసీఆర్ తదుపరి ప్రచార షెడ్యూల్ వివరాలు

  • డిసెంబర్ 2 నుంచి 4 వ తేదీ వరకు ప్రచార సభలు
  • 2న నాగర్ కర్నూల్, చేవెళ్ల.. హైదరాబాద్ లో సభలు
  • 3న సత్తుపల్లి, మధిర, కోదాడ తదితర చోట్ల
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 2 నుంచి 4 వ తేదీ వరకు ఆయన ప్రచారం జరగనుంది. మూడు రోజుల్లో మొత్తం 14 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

డిసెంబర్ 2వ తేదీన నాగర్ కర్నూల్, చేవెళ్ల, పటాన్ చెరువు, హైదరాబాద్ లలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. డిసెంబర్ 3న సత్తుపల్లి, మధిర, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ సభలలో, డిసెంబర్ 4న అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్ లలో నిర్వహించే ప్రచార సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
TRS
kcr
election campaign

More Telugu News