ప్రేమకు నిరాకరించడమే ఆమె చేసిన నేరం.. గొంతు కోసి చంపేసిన ఉన్మాది

  • తమిళనాడులోని తిరునెల్వేలిలో ఘటన
  • బస్టాండులో యువతి గొంతు కోసి హత్య
  • నిందితుడి కోసం పోలీసుల వేట
ప్రేమకు నిరాకరించడమే ఆ యువతి చేసిన నేరమైంది. తన ప్రేమను అంగీకరించని యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. తక్కలైకు చెందిన మెర్సీ వల్లియూరు బస్టాండు ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ తిరుకురుంగుడికి చెందిన రవి అనే యువకుడు గత కొంతకాలంగా వెంటపడి వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని వస్తున్న మెర్సీని బస్టాండ్ వద్ద కలిసిన రవి.. తనను ప్రేమించాలని కోరాడు. అందుకామె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైన మెర్సీ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు రవి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Tamilnadu
tirunelveli
Murder
Love
Crime News

More Telugu News