ఈ సారి హిట్ ఖాయమంటోన్న హీరో
- ఆసక్తికరమైన కథతో 'సుబ్రహ్మణ్య పురం'
- ఈ తరహా కథను చేయడం ఇదే మొదటిసారి
- అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది
నాస్తికుడైన హీరో .. ఆలయం నేపథ్యంలో జరిగే సంఘటనలపై పరిశోధన జరిపే క్రమంలో ఆయనకి ఎలాంటి అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి? అనే దిశగా కథ కొనసాగుతుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేనెల 7వ తేదీన విడుదల కానుంది.
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ .. "నా కెరియర్లో ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి .. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది .. ఈ సారి తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకం ఉంది" అని చెప్పాడు.