చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థికి బెదిరింపులు.. గట్టి పోలీస్ భద్రతను కల్పించిన ప్రభుత్వం!
- చాంద్రాయణగుట్ట నుంచి షహజాదీ పోటీ
- దాడి చేస్తామంటూ సోషల్ మీడియాలో వార్నింగ్
- పోలీసులను ఆశ్రయించిన బీజేపీ నేత
ఈ విషయమై ఫలక్నుమా ఏసీపీ డాక్టర్ రషీద్, దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ.. షహజాదీపై దాడి చేస్తామని సోషల్ మీడియాలో కొందరు దుండగులు హెచ్చరించారని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. భద్రత కోసం షహజాదీకి ఇద్దరు గన్ మెన్లను కేటాయించామని పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ఓడించేందుకు ఉన్నత విద్యావంతురాలైన షహజాదీని బీజేపీ రంగంలోకి దించింది.