డిస్కవర్ 100 సీసీ తేవడమే బజాజ్ చరిత్రలో అతిపెద్ద తప్పిదం!

  • డిస్కవర్ 125 సీసీ బైక్ కు మంచి మద్దతు
  • 100 సీసీ కావాలని కోరిన మార్కెట్ వర్గాలు
  • తయారు చేసి నష్టపోయామన్న రాజీవ్ బజాజ్
భారత వాహన మార్కెట్లో ఫెయిల్యూర్ మోడల్ గా ముద్రపడిన బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్ పై సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వృత్తి జీవితంలో ఈ బైక్ ను తేవడమే అతిపెద్ద తప్పని ఆయన అన్నారు. ఇదే బైక్ ను 125 సీసీలో విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చిందని, ఆ సమయంలో 100 సీసీ బైక్ వస్తే, విక్రయాలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. 100 సీసీ డిస్కవర్ బైక్ ను తెచ్చిన కారణంగానే భారత మార్కెట్లో బజాజ్ రెండో స్థానంలో ఉండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ బైక్ కారణంగా గడచిన ఐదేళ్లలో తమ స్థానాన్ని, పనితీరును నష్టపోయామని అన్నారు. కేటీఎం విషయంలో మాత్రం విజయం సాధించామని, ఈ సంవత్సరం హార్లే డేవిడ్ సన్ బైక్ లు 2.40 లక్షలుకాగా, కేటీఎం అమ్మకాలు 2.7 లక్షల యూనిట్లను దాటాయని రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరంలో తాము బ్యాటరీతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇ-వాహనాలపై పరిశ్రమ సవతి తల్లి ప్రేమను చూపుతోందని చెప్పిన ఆయన, 2019లో 'టెస్లా' టూ లేదా త్రీ వీలర్ వెహికిల్స్ లోకి వస్తుందని చెప్పారు.
Go Back to Shorts
Rajive Bajaz
Discover 125 CC
100 CC
Loss
Bajaj

More Telugu News