ఇంద్రగంటికి నానితోపాటు మరో యంగ్ హీరో దొరికేశాడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంద్రగంటికి నానితోపాటు మరో యంగ్ హీరో దొరికేశాడు

  • ఇంద్రగంటి నుంచి మల్టీ స్టారర్
  • ఒక హీరోగా నాని 
  • మరో హీరోగా నిఖిల్
'సమ్మోహనం'తో హిట్ కొట్టేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ, తన తదుపరి సినిమాకి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఆయన తదుపరి సినిమాగా మల్టీస్టారర్ రూపొందనుంది. ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా నాని చేయనున్నాడు. ఇటీవలే నానికి ఇంద్రగంటి కథ వినిపించడం .. నాని ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. గతంలో తనకి 'అష్టాచెమ్మా'.. 'జెంటిల్ మేన్' వంటి హిట్స్ ఇచ్చినందు వలన వెంటనే నాని అంగీకరించాడు.

రెండవ హీరో కోసం అన్వేషించిన ఇంద్రగంటి, నిఖిల్ అయితే బాగుంటుందని భావించాడట. వెంటనే ఆయనను కలిసి కథ కూడా చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 'ముద్ర' సినిమాను విడుదలకి సిద్ధం చేస్తోన్న నిఖిల్, త్వరలో 'శ్వాస'తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. నిఖిల్ అంగీకరిస్తే నాని 'జెర్సీ'.. నిఖిల్ 'శ్వాస' పూర్తికాగానే ఇంద్రగంటి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.   
nani
nikhil

More Telugu News