పోరాటయోధుడనని చెప్పుకునే జగన్ చిన్న కత్తి తగలగానే 10 రోజులు పడుకున్నారు!: పయ్యావుల కేశవ్
- చంద్రబాబు దాడి చేయించారనడం హాస్యాస్పదం
- అలాంటి సంస్కృతి టీడీపీకి ఎన్నడూ లేదు
- జగన్ హత్యాయత్నం కేసులో సీరియస్ గా ఉన్నాం
పోరాటయోధుడినని చెప్పుకునే జగన్ చిన్న కత్తిదాడికే 10 రోజులు విశ్రాంతి పేరుతో పడుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కు సానుభూతి, ప్రచారం రావాలనే ఉద్దేశంతోనే దాడిచేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. ఈ కోడికత్తి డ్రామాను ఏపీ ప్రజలు సైతం కోడి పందెంలాగే సరదాగా తీసుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ పై జరిగిన దాడిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా దోషులను శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.