అందుకే, ట్రాన్స్ జెండర్ కు టికెట్ కేటాయించాం: టీ-సీపీఎం కార్యదర్శి తమ్మినేని
- సామాజిక మార్పులో భాగంగానే ట్రాన్స్ జెండర్ కి టికెట్
- చంద్రముఖి ఉన్నత చదువు చదివింది
- ఓ ట్రాన్స్ జెండర్ కు టికెట్ కేటాయించిన ఘనత మాదే
ఏ రాజకీయ పార్టీ మాకు న్యాయం చేయలేదు
తనకు అవకాశం కల్పించింనందుకు బీఎల్ ఎఫ్ కు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చంద్రముఖి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ తమకు న్యాయం చేయలేదని అన్నారు.
బీల్ఎఫ్ ఆరో జాబితా విడుదల
తాజాగా, బీల్ఎఫ్ ఆరో జాబితాను ఈరోజు విడుదల చేసింది. ముథోల్ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్, సనత్ నగర్ నుంచి కల్లు వెంకటేశ్వరరెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి బుడిగె లింగస్వామి, మల్కాజ్ గిరి నుంచి ఐలయ్య, చాంద్రాయణగుట్ట నుంచి మహ్మద్ హాజీ, స్టేషన్ ఘన్ పూర్ నుంచి బొట్ల శేఖర్ బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు 106 అభ్యర్థులను బీఎల్ఎఫ్ ప్రకటించింది.
ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, పాలకపక్షాలకు బీఎల్ఎఫ్ మాత్రమే ప్రత్యామ్నాయమని, బీసీలకు టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 22 సీట్లు మాత్రమే ఇచ్చాయని, తాము మాత్రం 52 సీట్లిచ్చామని స్పష్టం చేశారు.