పెళ్లి తంతు ముగించుకుని ఇండియాలో కాలు పెట్టిన దీపిక, రణ్ వీర్!
- ఈ ఉదయం ముంబైలో దిగిన దీప్ వీర్ జంట
- చూసేందుకు పోటీ పడిన అభిమానులు
- ఎయిర్ పోర్టు అధికారుల సెల్ఫీలు
- దీపికకు అత్తవారింట ఘన స్వాగతం
షేర్వాణీపై ఎరుపు రంగు జాకెట్ ధరించిన రణ్ వీర్, బంగారు వర్ణంలో ఉన్న సిల్క్ పంజాబీ సూట్ ను దీపిక ధరించి కనిపించారు. ఎయిర్ పోర్టు అధికారులు ఈ జంటతో సెల్ఫీలు దిగాలని కోరగా, వారు అంగీకరించి, కాసేపు సెల్ఫీలు దిగారు. ఈ జంట 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో దిగిన వీరు నేరుగా రణ్ వీర్ నివాసానికి వెళ్లగా, వీరికి సంప్రదాయ రీతిలో బంధుమిత్రులు స్వాగతం పలికారు.