అన్నా .. ఫస్టు మాకు 'సాహో' అప్డేట్ ఇవ్వండన్నా: ప్రభాస్ ను కోరిన విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

అన్నా .. ఫస్టు మాకు 'సాహో' అప్డేట్ ఇవ్వండన్నా: ప్రభాస్ ను కోరిన విజయ్ దేవరకొండ

  • ఈ నెల 17న 'టాక్సీవాలా'
  • పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దన్న ప్రభాస్ 
  • 'సాహో' అప్డేట్ అడిగిన విజయ్ దేవరకొండ    
విజయ్ దేవరకొండ అభిమానులంతా కూడా 'టాక్సీవాలా' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ కి ప్రభాస్ తన ట్విట్టర్ ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేశారు. 'మీకు దగ్గరలోని థియేటర్లో ఈ సినిమా చూడండి .. పైరసీని ఎంకరేజ్ చేయకండి' అని అభిమానులతో చెప్పాడు.

ప్రభాస్ ట్వీట్ కి విజయ్ దేవరకొండ వెంటనే స్పందిస్తూ " అన్నా .. ఫస్టు మాకు 'సాహో' అప్డేట్ ఇవ్వండన్నా' అంటూ, ప్రభాస్ పట్ల తనకి గల అభిమానాన్నీ .. 'సాహో' సినిమా పట్ల తనకి గల ఆసక్తిని వ్యక్తం చేశాడు. 'టాక్సీవాలా' సినిమాపట్ల ప్రభాస్ స్పందించడం వలన, మరింతమంది దృష్టి తమ సినిమాపై పడుతుందనీ, పైరసీని ఎంకరేజ్ చేయవద్దని ప్రభాస్ చేసిన రిక్వెస్ట్ తమ సినిమాకి హెల్ప్ అవుతుందని ఈ సినిమా టీమ్ భావిస్తోంది.    
prabhas
vijay devarakonda

More Telugu News