అమ్మకు అనారోగ్యం .. సినిమాలు మానేద్దామనుకున్నా: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

అమ్మకు అనారోగ్యం .. సినిమాలు మానేద్దామనుకున్నా: విజయ్ దేవరకొండ

  • అమ్మ హాస్పిటల్లో వుంది 
  • ఆమె దగ్గర లేనందుకు బాధ 
  • ఫోన్ చేసి ఆ మాట చెప్పేశాను
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నిర్మితమైన 'టాక్సీవాలా' .. ఈ నెల 17వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ఈ సినిమా పైరసీ సైట్లలో లీక్ అయిందనే వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. ఈ సినిమా సమయంలో తమకి ఎదురైన కష్టాలను గురించి ప్రస్తావించాడు. "సినిమాటో గ్రాఫర్ సుజిత్ నారంగ్ మెడ నొప్పిని సైతం లెక్క చేయకుండా వర్క్ చేశాడు. సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తన తండ్రికి కేన్సర్ అనే చేదు నిజాన్ని తట్టుకుంటూ పనిచేశాడు.

ఇదే సమయంలో మా అమ్మ అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. షూటింగు స్పాట్ లో వున్న నాకు ఏం జరుగుతున్నది తెలియడం లేదు. అమ్మ దగ్గర ఉండలేకపోవడం ఎంతో బాధనిపించింది. దాంతో ఇకపై ఇలాంటి పరిస్థితి రాకూడదని భావించి, సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అడ్వాన్సులు ఇచ్చిన దర్శక నిర్మాతలకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పేశాను కూడా. అలాంటి ఒత్తిడిలో మేము చేసిన సినిమా లీక్ అయిందంటే ఎలా వుంటుందో ఒకసారి ఆలోచించండి" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 
vijay devarakonda

More Telugu News