రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో దారుణం... ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుంటే వీడియో తీసిన సూపరింటెండెంట్!
- తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
- కీచకుడిగా మారిన సూపరింటెండెంట్ రియాజ్
- రహస్య వీడియో చిత్రీకరణను నిన్న కనిపెట్టిన ఉద్యోగిని
నిన్న ఆ మహిళ బట్టలు మార్చుకునేందుకు వెళ్లిన వేళ, చిన్న ఎల్ఈడీ బల్బు వెలగడంతో అనుమానం వచ్చిన ఆమె, అసలు విషయాన్ని గుర్తించింది. ఈ విషయంలో ఆమె పై అధికారులను ఆశ్రయించగా, పోలీసులు రంగంలోకి దిగి, రియాజ్, రహస్యంగా వీడియో తీశాడని నిర్ధారించారు. దీంతో డీఆర్ఎం ఆదేశాలతో అతన్ని సస్పెండ్ చేశారు అధికారులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.