మరో రీమేక్ తో రంగంలోకి దిగుతోన్న హరీశ్ శంకర్
- 'దువ్వాడ' తరువాత వచ్చిన గ్యాప్
- వర్కౌట్ కాని 'దాగుడుమూతలు'
- 'జిగర్తాండ' రీమేక్ పై దృష్టి
గతంలో 'దబాంగ్' హిందీ మూవీని 'గబ్బర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలాగే ఇప్పుడు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'జిగర్తాండ' సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ రీమేక్ కి సంబంధించిన విషయాలను హరీశ్ శంకర్ త్వరలోనే ప్రకటించనున్నాడట.