ముందు '2.ఓ'... తరువాత నేనే: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

ముందు '2.ఓ'... తరువాత నేనే: విజయ్ దేవరకొండ

  • 'టాక్సీవాలా'గా రాబోతున్న విజయ్ దేవరకొండ
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ
  • ట్రెండింగ్ లో టాప్ -2 'టాక్సీవాలా'
'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో యూత్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు 'టాక్సీవాలా'గా రాబోతున్నాడు. ఈ సినిమా పైరసీ అయినా, వెనుకడుగు వేయని నిర్మాతలు, ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విజయ్, ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో తొలుత '2.0' ఉందని, ఆ తరువాత తన చిత్రమేనని అన్నాడు. 'బుక్ మై షో'లో కూడా అత్యధికులు ఎదురు చూస్తున్న రెండో చిత్రం 'టాక్సీవాలా' అని అన్నాడు. తాను చేసే సినిమాల స్క్రిప్టులు ఎలా ఉండాలో అభిమానులే ఎంచుకుంటారని అన్నాడు. "మీ వెనుక నేను, నా వెనుక మీరు ఎల్లప్పుడూ ఉండి ప్రేమను పంచుతారు" అని విజయ్ ట్వీట్ చేశాడు.
Vijay Devarakonda
Taxiwala
Rajanikant
2.0

More Telugu News