శబరిమల పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దాం: పర్యావరణవేత్త సూచన
- కేరళ పునర్నిర్మాణం అంశంపై మాట్లాడిన అచ్యుతన్
- చిన్న విషయం గురించి సమయం, శక్తి వృథా
- మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం
రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపీఐ) ఆధ్వర్యంలో వరదల అనంతరం కేరళ పునర్నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో అచ్యుతన్ మాట్లాడారు. మగవాళ్లు వద్దు, ఆడవాళ్లు వద్దు, అది పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దామంటూ సూచన చేశారు. కేరళ పునర్నిర్మాణం గురించి మాట్లాడుకోవాల్సిన సమయంలో ఓ చిన్న విషయం గురించి సమయాన్ని, శక్తిని వృథా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలపై గతంలో జరిపించిన సర్వేలో అచ్యుతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన అభివృద్ధి పేరిట మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.