కొత్త కథతో రంగంలోకి దిగిన శేఖర్ కమ్ముల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త కథతో రంగంలోకి దిగిన శేఖర్ కమ్ముల

  • శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • పరిచయం కానున్న కొత్త నటీనటులు
  • డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు 
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ములకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. 'ఫిదా' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన, తన తదుపరి సినిమా కోసం మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. అందుకోసం బాగానే గ్యాప్ తీసుకున్నాడు. ఆయన తాజా చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కొంతసేపటి క్రితం సికింద్రాబాద్ - గణపతి  ఆలయంలో జరిగాయి.

శేఖర్ కమ్ములతోపాటు నిర్మాతలు .. సహ నిర్మాతలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఆల్రెడీ వాళ్ల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తిచేసేశాడు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.   
sekhar kammula

More Telugu News