'గూఢచారి' సీక్వెల్ కి సన్నాహాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గూఢచారి' సీక్వెల్ కి సన్నాహాలు

  • శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 'గూఢచారి'
  • సీక్వెల్ కి కథ రెడీ చేస్తోన్న అడివి శేష్
  • సీక్వెల్ దర్శకుడిగా రాహుల్ పాకాల     
ఒక సినిమా హిట్ అయితే .. ఆ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కించడమనేది చాలాకాలం నుంచి వున్నదే. అలా ఇప్పుడు 'గూఢచారి' సినిమాకి సీక్వెల్ రూపొందనున్నట్టు తెలుస్తోంది. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో నిర్మితమైన ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇస్తూనే ముగించారు.

ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించిన కథను రెడీ చేసే పనిలో అడివి శేష్ బిజీగా వున్నాడట. 'గూఢచారి'లోని ప్రధాన పాత్రల పరిధిని పెంచుతూ ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. 'గూఢచారి' సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ముఖ్యమైన పాత్రను పోషించిన రాహుల్ పాకాల, ఈ సీక్వెల్ కి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.     
adivi shesh

More Telugu News