ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుంచి బాలరాజు మూడుసార్లు మంత్రి అయ్యారు!: పవన్ కల్యాణ్
- గిరిజనుల సంక్షేమానికి పాటుపడ్డారు
- వైఎస్ హయాంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నారు.
- జనసేనలో చేరిన బాలరాజు
మన ఆశయాలు మంచిగా ఉంటే నాయకులు తమంతటా తామే వస్తారని తాను విశ్వసిస్తానని పవన్ తెలిపారు. అందువల్లే భావసారూప్యత ఉన్న నాదెండ్ల మనోహర్, బాలరాజు జనసేనలో చేరారని వెల్లడించారు. ఓ ఆర్టీసీ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన బాలరాజు మూడు సార్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు.
వైఎస్ హయాంలో మైనింగ్ ఉద్ధృతంగా సాగుతున్న వేళ.. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను బాలరాజు గట్టిగా వ్యతిరేకించి అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో బాలరాజు చాలా గట్టిగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఇక నాదెండ్ల మనోహర్ అయితే ఓ స్పీకర్ గా చాలామంది ప్రజాప్రతినిధులు అరకు ప్రాంతానికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులను చూపారన్నారు. టీడీపీ ఎంత ఒత్తిడి చేసినా లొంగకుండా గిరిజన ప్రజలకు అండగా బాలరాజు నిలబడ్డారని కితాబిచ్చారు.