'సర్కార్' లో పవన్ ను ఇమిటేట్ చేసిన విజయ్
Add ap7am to your home Screen

'సర్కార్' లో పవన్ ను ఇమిటేట్ చేసిన విజయ్

  • విజయ్ నుంచి వచ్చిన 'సర్కార్'
  • భారీ వసూళ్లతో కొత్త రికార్డులు
  • అభిమానుల ఆనందం  
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. రజనీ .. కమల్ తరువాత, అజిత్ .. విజయ్ నువ్వా? నేనా? అన్నట్టుగా అక్కడ పోటీపడుతుంటారు. మాస్ హీరోగా ఒక రేంజ్ లో దూసుకుపోతోన్న విజయ్ నుంచి దీపావళి కానుకగా 'సర్కార్' సినిమా వచ్చింది. విడుదలైన ప్రతిచోటున ఈ సినిమా విజయవిహారం చేస్తోంది.

వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అలాంటి విజయ్ ఈ సినిమాలో ఒక సీన్ లో రజనీకాంత్ మేనరిజం చూపించాడు. ఒక ఫైట్లో రజనీ స్టైల్లో విజయ్ చూయింగ్ గమ్ నోట్లో వేసుకుంటాడు. మరో సీన్లో ఆయన పవన్ కల్యాణ్ స్టైల్ ను అనుసరించాడు. కొత్త హీరోలు .. సీనియర్ హీరోల స్టైల్ ను అనుసరించడం సహజం. కానీ విజయ్ లాంటి స్టార్ హీరో .. ఇతర హీరోల స్టైల్ ను అనుసరించడం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.
 
vijay
keerti suresh

More Telugu News