'ఎన్టీఆర్'లో భాగమైన అనుష్క... బీ సరోజాదేవి పాత్రలోనట!

  • జనవరి 9న విడుదల కానున్న 'ఎన్టీఆర్ - కథానాయకుడు'
  • బీ సరోజాదేవి పాత్రలో నటిస్తున్న అనుష్క
  • ఇంకా వెల్లడికాని అధికారిక ప్రకటన
నందమూరి బాలకృష్ణ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో అనుష్క కూడా భాగమైనట్టు తెరుస్తోంది. జనవరి 9న తొలిభాగం 'ఎన్టీఆర్ - కథానాయకుడు' విడుదల కానుండగా, బీ సరోజాదేవి పాత్రలో అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.

అప్పట్లో ఎన్టీఆర్, సరోజాదేవి కలిసి నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయా సినిమాలకు చెందిన కొన్ని విషయాలను బయోపిక్ లో చూపిస్తున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగానే, అనుష్క ఫస్ట్ లుక్ స్టిల్ విడుదల అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సరోజాదేవి పాత్రలో అనుష్క నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
Go Back to Shorts
NTR
Biopic
Balakrishna
Anushka Shetty

More Telugu News