ఫామ్ హౌస్ లో కూర్చుని మందుకొట్టడం ఒక్కటే కేసీఆర్ కు తెలుసు!: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
- ఆయనకు ప్రజా సమస్యలు పట్టవు
- తాగుబోతు నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయండి
- నర్సాపూర్ లో కాంగ్రెన్ ను గెలిపించండి
కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సందర్భం వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ దగ్గర గులాం గిరి చేసే మదన్ రెడ్డి కావాలో.. అసెంబ్లీలో నర్సాపూర్ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఆశీస్సులతో నర్సాపూర్‌లో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేత సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..బంగారు తెలంగాణలో మహిళలు మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.