విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని
Add ap7am to your home Screen

విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని

  • బన్నీతో అనుకున్న సినిమా వాయిదా 
  • నానికి కథ వినిపించిన విక్రమ్ కుమార్ 
  • త్వరలోనే షూటింగుకు ఏర్పాట్లు
తెలుగులోని యువకథానాయకులలో నానికంటూ ప్రత్యేకమైన స్థానం వుంది. కొత్తగా .. వాస్తవానికి దగ్గరగా తన పాత్రలు ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటాడు. అందువల్లనే ఆయన ఖాతాలో విజయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

గతంలోనే ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. బన్నీతో చేయవలసిన ప్రాజెక్టు వాయిదా పడటంతో, అంతకు ముందు నానితో అనుకున్న సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్లో ఈ సినిమా ఉండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇక సుకుమార్ కి కూడా నాని ఓకే చెప్పాడనే వార్త వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ సినిమా తరువాత ఆ ప్రాజెక్టు ఉండొచ్చని తెలుస్తోంది.  
nani
vikram kumar

More Telugu News