ఆయనే బతికుంటే ఎలా స్పందించేవారో... హాట్ టాపిక్ గా మారిన హీరో నిఖిల్ ట్వీట్!
- సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే నిఖిల్
- సర్దార్ బతికుంటే విగ్రహ ఖర్చు చూసి ఏమనేవారో?
- తనకు తెలియడం లేదన్న నిఖిల్
"దేశమంతటినీ ఐక్యంగా ఉంచిన ఘనత కచ్చితంగా సర్దార్ కే చెందుతుంది. ఆయన చేసిన కృషికి కచ్చితంగా తగిన గుర్తింపు ఇవ్వాల్సిందే. అయితే, ఆయనే గనుక బతికి ఉంటే తన విగ్రహ ఏర్పాటుకు అయిన ఖర్చును చూసి ఎలా స్పందించేవారో? తెలియడం లేదు" అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు నిఖిల్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.