తెలంగాణకు బద్ధ శత్రువైన చంద్రబాబుతో కోదండరాం జతకట్టడం సిగ్గుచేటు!: ఓయూ జేఏసీ నేతలు
- తెలంగాణలో పెత్తనానికి ఆంధ్రా నేతల కుట్ర
- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఖమ్మం జిల్లాది కీలకపాత్ర
- మహాకూటమి అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
కోదండరాం, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఖమ్మం జిల్లా అంటే సీఎం కేసీఆర్ కు చాలా అభిమానమని తెలిపారు. అందుకే జిల్లాకు 3 కార్పొరేషన్లను సీఎం కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణలో మహాకూటమికి బుద్ధి చెప్పాలనీ, జిల్లాలోని 10 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణలో చంద్రబాబు, కోదండరాం ప్రచారానికి వస్తే తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.