విజయ్ దేవరకొండ .. రవితేజ మధ్య పోటీ తప్పడం లేదు
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ .. రవితేజ మధ్య పోటీ తప్పడం లేదు

  • శ్రీను వైట్లతో రవితేజ మూవీ
  • 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ 
  • ఆలస్యం కారణంగా తగ్గిన అంచనాలు    
రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేశాడు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమా, కథాపరంగా విదేశాల్లోనే ఎక్కువగా షూటింగ్ జరుపుకుంది. మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజ కనిపించనున్న ఈ సినిమా, వచ్చేనెల 16వ తేదీన విడుదల కానుంది. డిసెంబర్లో రిలీజ్ చేద్దామని ముందుగా అనుకున్నప్పటికీ, కొన్ని కారణాలవలన నవంబర్లోకి వచ్చేశారు.ఇక విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన 'టాక్సీవాలా' సినిమా కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి కొంతకాలమైనా, కొన్ని కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అలా ఈ రెండు సినిమాలు నవంబర్ 16వ తేదీకి ఫిక్స్ అయ్యాయి. యూత్ లో విజయ్ దేవరకొండకి క్రేజ్ ఎక్కువ అయినప్పటికీ, ఆలస్యం కారణంగా 'టాక్సీవాలా'పై అంచనాలు తగ్గాయి. రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని'పై మాత్రం హైప్ కనిపిస్తోంది.      
vijay devarakonda
raviteja

More Telugu News