చెలరేగిన అంబటి రాయుడు.. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో వెస్టిండీస్ కు టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 162, రాయుడు 100 పరుగులతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఇండియన్ బ్యాట్స్ మెన్లలో ధావన్ 38, కోహ్లీ 16, ధోనీ 23, జాధవ్ 16, జడేజా 7 పరుగులు చేశారు. జాధవ్, జడేజాలు నాటౌట్ గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రోచ్ 2 వికెట్లు, నర్స్, కీమో పాల్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో రోహిత్ శర్మ 21వ సెంచరీ చేయగా, రాయుడు మూడో శతకాన్ని నమోదు చేశాడు. 81 బంతుల్లో 100 పరుగులు చేసిన రాయుడు రనౌట్ గా వెనుదిరిగాడు. 
Go Back to Shorts
team india
west indies
one day
score

More Telugu News