పోలీస్ ఆఫీసర్ గా వస్తోన్న అజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీస్ ఆఫీసర్ గా వస్తోన్న అజయ్

  • హీరోగా మెప్పించిన అజయ్ 
  • విలన్ గాను మంచి మార్కులు 
  • మరోసారి ప్రధాన పాత్రలో  
తెలుగు తెరపై కథానాయకుడిగా .. ప్రతినాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాడు. విలక్షణమైన తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి అజయ్ మరోసారి ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకురావడానికి రెడీ అవుతున్నాడు. వాత్సవ్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందింది. ఇటీవలే షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

'స్పెషల్ ' అనే టైటిల్ తో నిర్మితమైన ఈ సినిమాలో అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించామనీ, ప్రేక్షకులకు ఆ కాన్సెప్ట్ ఆశ్చర్యకరంగా అనిపిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నామనీ, నవంబర్ చివరివారంలో సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు.
ajay

More Telugu News