భార్య లావు అయిందని తలాక్ చెప్పేశాడు!

భార్య బరువు పెరిగి, బొద్దుగా తయారైందనే కారణంతో తలాక్ చెప్పేశాడు ఓ భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్ బాబువా జిల్లాలో జరిగింది. పదేళ్ల క్రితం ఆరిఫ్ హుస్సేన్, సల్మాలకు పెళ్లి అయింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. తాను లావయ్యాననే కారణంతో ప్రతి రోజు తనను కొడుతుండేవాడని పోలీసులకు సల్మా ఫిర్యాదు చేసింది. తనకు తలాక్ కూడా చెప్పాడని ఫిర్యాదులో వాపోయింది. ముస్లిం మహిళలను రక్షించేందుకు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన తర్వాత కూడా... తనకు తలాక్ చెప్పాడని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరిఫ్ పై పోలీసులు సెక్షన్ 323, 498 కింద  కేసు నమోదు చేశారు. ఆరిఫ్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. 
Go Back to Shorts
muslim
women
talak
Madhya Pradesh

More Telugu News