ఈ ఏడాది అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగా 'గీత గోవిందం'
Add ap7am to your home Screen

ఈ ఏడాది అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగా 'గీత గోవిందం'

  • రెండవస్థానంలో 'రంగస్థలం'
  • మూడవ స్థానంలో 'మహానటి' 
  • నాల్గొవ స్థానంలో 'భరత్ అనే నేను'
ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా సందడి చేశాయి. వసూళ్ల పరంగా దూసుకుపోయిన వాటిలో చిన్న సినిమాలు .. పెద్ద సినిమాలు కూడా వున్నాయి. పెట్టిన పెట్టుబడి .. వచ్చిన రాబడిని బట్టి చూస్తే, అత్యధిక లాభాలను రాబట్టిన చిత్రంగా 'గీత గోవిందం' కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'గీత గోవిందం' 55 కోట్లకి పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

రెండవ స్థానంలో 'రంగస్థలం' కనిపిస్తోంది. చరణ్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా 43 కోట్ల లాభాలను రాబట్టింది. ఈ జాబితాలో మూడవ స్థానంలో 'మహానటి' నిలిచింది. ఈ సినిమా 25 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక నాల్గొవ స్థానంలో 'భరత్ అనే నేను నిలిచింది. కొరటాల దర్శకత్వంలో మహేశ్ చేసిన ఈ సినిమా 15 కోట్ల లాభాలను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఫుల్ రన్ లో 'అరవింద సమేత' ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో .. ఏ స్థానాన్ని ఆక్రమిస్తుందో చూడాలి.  
vijay devarakonda
rashmika

More Telugu News