'పందెం కోడి 3'కి రెడీ అవుతున్నాం: విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పందెం కోడి 3'కి రెడీ అవుతున్నాం: విశాల్

  • భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 'పందెం కోడి 2' 
  • 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకి పైగా షేర్ 
  • మాస్ రోల్ లో మెప్పించిన కీర్తి సురేశ్
విశాల్ కథానాయకుడిగా లింగుస్వామి తెరకెక్కించిన 'పందెం కోడి 2' ఈ నెల 18వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదలైంది. తమిళంలో మాస్ ఆడియన్స్ ను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక తెలుగులోను విశాల్ కి గల మాస్ ఇమేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో ఈ సినిమాను 6 కోట్లకి కొనుగోలు చేస్తే, 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకి పైగా షేర్ ను రాబట్టింది.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటం పట్ల విశాల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'పందెం కోడి' తనకి బాగా కలిసొచ్చిందనీ .. 'పందెం కోడి 3'ని కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని లింగుస్వామికి ఆల్రెడీ చెప్పేశానని అన్నాడు. ఇక కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. 'మహానటి' తరువాత ఒక మాస్ రోల్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అదృష్టం కొద్దీ నాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. మాస్ రోల్ చాలా బాగా చేశానని అంతా అంటూ వుంటుంటే సంతోషంగా వుంది " అని చెప్పుకొచ్చింది.  
vishal
keerti suresh

More Telugu News