శృంగార తారగా షకీలా .. బయోపిక్ ప్రమోషన్స్ లో బెల్లీ డాన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శృంగార తారగా షకీలా .. బయోపిక్ ప్రమోషన్స్ లో బెల్లీ డాన్స్

  • తెరపైకి 'షకీలా' బయోపిక్
  • కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు
  • త్వరలోనే మొదలుకానున్న ప్రమోషన్స్
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో షకీలా చాలా చిత్రాలలో నటించింది. ఒకానొక సమయంలో శృంగార తారగా ఆమె విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెరపై కవ్వించే తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి. ఆమె కెరియర్ తళుకుల వెనుక ఎన్నో కన్నీటి చారలు వున్నాయి. అలాంటి షకీలా జీవితచరిత్ర వెండితెరపైకి రానుంది .. ఆమె పాత్రలో రిచా చద్దా కనిపించనుంది.

షకీలా బాడీ లాంగ్వేజ్ ను బాగా పరిశీలించిన తరువాతనే రిచా రంగంలోకి దిగింది. నెల్లూరు జిల్లాకి చెందిన షకీలా ఎలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది? శృంగార తారగా యూత్ చేత ఇంతగా ఆరాధించబడటానికి వెనుక ఎన్ని కష్టనష్టాలను భరించింది? అనేది ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రమోషన్స్ లో రిచా చద్దా బెల్లీ డాన్స్ చేయనుందట. అందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటోందని అంటున్నారు. 
richa

More Telugu News