శబరిమల వివాదంలో ట్విస్ట్.. రివ్యూ పిటిషన్లను వచ్చే నెల 13న విచారించనున్న సుప్రీంకోర్టు!

  • విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం
  • 10-50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై కేసు
  • రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన హిందూ సంస్థలు
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 13 మధ్యాహ్నం 3 గంటలకు వీటిపై విచారణ చేపడతామని తెలిపింది.

కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అనుమతించరు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐదుగురు జడ్జీల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఈ నిబంధనను కొట్టివేస్తూ 4:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ నిబంధనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో శబరిమలలో మహిళల ప్రవేశంపై సంప్రదాయవాదులు తీవ్ర ఆందోళనకు దిగారు.

పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళల్ని అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు హిందూ సంస్థలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.
Go Back to Shorts
sabarimala
kerala
ayyappa swami
Supreme Court
review petitions

More Telugu News