Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు అవినీతి రాహుల్ గాంధీకి కనిపించడం లేదు: వినోద్

  • ప్రాంతీయ పార్టీలను బీజేపీ, కాంగ్రెస్ లు అణగదొక్కుతున్నాయి
  • తెలంగాణలో గెలిచేది టీఆర్ఎస్సే
  • కేంద్రంలో కూడా చక్రం తిప్పుతాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కనిపించడం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి గురించి అందరూ మాట్లాడుతుంటే... రాహుల్ మాత్రం మాట్లాడటం లేదని అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని... బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలసి జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా రెండు పార్టీలు యత్నిస్తున్నాయని... రెండు పార్టీల్లో ఎవరో ఒకరు కేంద్రంలో అధికారంలో ఉండాలనే ధోరణితో ముందుకు సాగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఈ రెండు పార్టీల పప్పులు ఉడకవని... తెలంగాణ బిడ్డల పార్టీ టీఆర్ఎస్సే అని చెప్పారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
Chandrababu
Rahul Gandhi
vinod
TRS
bjp
congress

More Telugu News