టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలి వికెట్ కోల్పోయిన విండీస్

వెస్టిండీస్, ఇండియాల మధ్య తొలి వన్డే గువాహటిలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో రిషబ్ పంత్ అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్ కు దిగిన వెండీస్ ను ఆదిలోనే షమీ దెబ్బతీశాడు. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ఓపెనర్ హేమరాజ్ (9)ను షమీ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ పావెల్ 11 పరుగులతో ఆడుతున్నాడు. హోప్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు.  
Go Back to Shorts
team india
west indies
oneday

More Telugu News