నిర్మాతగా తప్పుకుంటే రూ. 100 కోట్లు... రాజమౌళి తదుపరి చిత్రం కోసం దానయ్యకు బంపరాఫర్!
Add ap7am to your home Screen

నిర్మాతగా తప్పుకుంటే రూ. 100 కోట్లు... రాజమౌళి తదుపరి చిత్రం కోసం దానయ్యకు బంపరాఫర్!

  • దానయ్య నిర్మాతగా రాజమౌళి తదుపరి చిత్రం
  • హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
  • తప్పుకుంటే రూ. 100 కోట్లు ఇస్తానన్న నిర్మాత
తన కెరీర్ లో పరాజయం ఎరుగకుండా, వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని డీవీవీ దానయ్య బ్యానర్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తూ ఉండటంతో దీనికి ట్రేడ్ వర్గాల్లో ఎనలేని క్రేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఇక 'బాహుబలి'తో రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా తప్పుకుంటే భారీ మొత్తంలో నగదు ఇస్తామని దానయ్యకు ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రాజమౌళి చిత్రానికి తాను ఎంతైనా పెడతానని చెప్పిన సదరు నిర్మాత, దానయ్య తప్పుకుంటే, రూ. 100 కోట్లను ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. రాజమౌళి తదుపరి చిత్రం షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కానప్పటికీ, దీన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ బయ్యర్లు క్యూలో ఉన్నారు. ఇక దానయ్యకు నిర్మాత ఆఫర్ గురించిన విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇది నిజమేనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
Rajamouli
Ramcharan
NTR
DVV Danaiah
Producer

More Telugu News