శబరిమల కొండపైకి వచ్చా.. నేను గెలిచాను: హైదరాబాద్ పాత్రికేయురాలు కవిత
- ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలు
- 18 మెట్ల వద్ద అడ్డుకున్న భక్తులు
- ఆలయంలోకి తీసుకెళ్లలేమని చెప్పిన అధికారులు
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కొండపైకి రావడం సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. కొండపైకి వెళ్లే విషయంలో తాను గెలిచానని చెప్పగలనని అన్నారు. కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మళ్లీ శబరిమలకు వస్తానని చెప్పారు. ఈ అంశంపై ఐజీ స్థాయి పోలీసు అధికారి మాట్లాడుతూ, మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా భక్తులు అడ్డుకున్నారని.... ఆలయం తలుపులు మూసేస్తానని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారని... దీంతో, మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారని చెప్పారు.