భారీ బడ్జెట్ కారణంగానే ఆ సినిమా ఆగిపోయింది : హీరో రామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ బడ్జెట్ కారణంగానే ఆ సినిమా ఆగిపోయింది : హీరో రామ్

  • మంచి ఫీల్ వున్న లవ్ స్టోరీ ఇది 
  • యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది 
  • ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా ఉంటుంది    
రామ్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం నిర్మితమైంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, దసరా కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ .. ఈ సినిమా తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో యూత్ ఆశించే ఫీల్ ఉంటుందనీ .. ఒక ప్రేమజంటతో కలిసి యూత్ అంతా మంచి జర్నీ చేస్తారని అన్నాడు.

ఇక ప్రవీణ్ సత్తారుతో సినిమా పట్టాలెక్కకపోవడం గురించి ఆయన ప్రస్తావించాడు. ప్రవీణ్ సత్తారుతో ఒక మంచి సినిమా చేయాలనుకున్నాను .. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టాలని కూడా అనుకున్నాము .. కానీ కుదరలేదు. ఆ సినిమాకి భారీ బడ్జెట్ అవసరమవుతుందనీ, అందువలన ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పాడు. భవిష్యత్తులో ప్రవీణ్ సత్తారుతో కలిసి తప్పకుండా ఒక సినిమా చేస్తానని ఆయన అన్నాడు.
ram
anupama

More Telugu News