రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కఠోర శిక్షణ
Add ap7am to your home Screen

రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కఠోర శిక్షణ

  • 'అరవింద'తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి రాజమౌళి సినిమా
  • తన లుక్ పై ప్రత్యేక శ్రద్ధ
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనీ .. ఆయనతో కలిసి ఒక హిట్ కొట్టాలని ఎన్టీఆర్ ఎంతో కాలంగా ఎదురుచూస్తూ వచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' ఆ ముచ్చట తీర్చేసింది. దసరా రేసులో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. దాంతో ఈ సినిమా కోసం నాన్ స్టాప్ గా పనిచేసిన ఎన్టీఆర్, నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవచ్చనే టాక్ వచ్చింది.

అయితే ఎన్టీఆర్ రిలాక్స్ కావాలని అనుకోవడం లేదట. తన తదుపరి సినిమా రాజమౌళితో కావడంతో, ఆయన సినిమాలో తన లుక్ కి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. శారీరక పరమైన కసరత్తుల విషయంలో 45 రోజుల పాటు కఠోర శిక్షణ తీసుకోనున్నాడని చెబుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించే ఈ సినిమా వచ్చేనెల 15వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్లోనే ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. అందువలన అప్పటికి తాను సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కష్టపడుతున్నాడని చెబుతున్నారు. 
ntr
rajamouli

More Telugu News