నా భర్తతో అఫైర్ ఉన్న సమయానికి మోనికా వయసు 22 ఏళ్లు: హిల్లరీ క్లింటన్
- మోనికాతో బిల్ క్లింటన్ కు అఫైర్
- అప్పటికే మోనికా వయోజనురాలన్న హిల్లరీ
- అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు
మోనికాతో తన అఫైర్ కు సంబంధించి అబద్ధాలను చెప్పిన బిల్ క్లింటన్ అప్పట్లోనే తన పదవి నుంచి దిగిపోతే బాగుండేదని న్యూయార్క్ సెనేటర్ గిల్లిబ్రాండ్ తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై హిల్లరీ స్పందిస్తూ... అంత అవసరంలేదని చెప్పారు. ఆ ఘటన జరిగిన సమయంలో మోనికా వయసు 22 ఏళ్లని... అప్పటికే ఆమె వయోజనురాలు (అడల్ట్) అని చెప్పారు.
మోనికాతో అఫైర్ వెలుగు చూసిన తర్వాత 1999లో ఆయనను పదవి నుంచి తొలగించేందుకు దాదాపు నెల రోజుల పాటు సెనేట్ ట్రయల్ నిర్వహించింది. ఆయనను తొలగించడానికి సెనేట్ లో మూడింట రెండొంతుల మెజార్టీ రావాలి. అయితే, కావాల్సినంత మెజార్టీకి కొంచెం తక్కువ రావడంతో బిల్ క్లింటన్ గట్టెక్కారు. మరోవైపు, ఈ అఫైర్ ఇద్దరి ఇష్టంతోనే కొనసాగిందని ఇంతకాలం మోనికా చెబుతూ వచ్చింది. అయితే, తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తెలిపింది.