డీకే అరుణది సిగ్గుతప్పిన బతుకు: జూపల్లి

  • అరుణను పానగల్ నుంచి తానే గెలిపించా
  • సిగ్గుశరం తెచ్చుకుని నిజాలు మాట్లాడాలి
  • క్లర్క్ నుంచి ఈ స్థాయికి ఎదిగిన చరిత్ర నాది
తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నా అంటూ తనను అడిగితే పానగల్ నుంచి అరుణను తాను గెలిపించానని చెప్పారు. సిగ్గుశరం తెచ్చుకుని ఆమె నిజాలు మాట్లాడాలని అన్నారు. అరుణది సిగ్గుతప్పిన బతుకని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మల్లు రవి, చిన్నారెడ్డి, జగదీష్ రెడ్డిలు తనను వచ్చి కలిశారని... పానగల్ జెడ్పీటీసీ స్థానం నుంచి డీకే అరుణను గెలిపించానని చెప్పారు. స్వయం కృషితో ఒక క్లర్క్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన చరిత్ర తనదని అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని జూపల్లి విమర్శించారు. 2009లో కొల్లాపూర్ సీటు గెలిచి కాంగ్రెస్ పార్టీకి తానే భిక్ష పెట్టానని చెప్పారు. ప్రజల ఆలోచన మేరకే ఆనాడు మంత్రి, ఎమ్మెల్యే పదవులను వదులుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే హక్కు అరుణకు లేదని చెప్పారు. తెలంగాణను తానే ఇచ్చానని 2014లో సోనియాగాంధీ చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేదని... ఇకపై అధికారంలోకి రావడం కూడా కష్టమేనని అన్నారు. 
Go Back to Shorts
dk aruna
jupalli krishna rao
TRS
congress
kcr

More Telugu News