ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేయాలని వుంది: కౌశల్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేయాలని వుంది: కౌశల్

  • ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా చేశాడు 
  • ఆయన నటన నాలాంటివారికి బుక్ లాంటిది 
  • విలన్ గా జగపతిబాబు అదరగొట్టేశాడు  
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా చూసిన వాళ్లంతా, ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని అంటున్నారు. ఇక విలన్ గా జగపతిబాబు కూడా అదరగొట్టేశాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన కౌశల్ కూడా తనదైన శైలిలో స్పందించాడు.

'ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా గొప్పగా నటించాడు .. ఆయన నటన నాలాంటి వారికి ఒక బుక్ లాంటిది. ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించాలని వుంది. జగపతిబాబు పాత్రను చూశాక అలాంటి పాత్ర నాకు పడితే బాగుంటుందని అనిపించింది' అన్నాడు.

ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా కౌశల్  చేస్తే చూడాలని వుంది అంటూ సోషల్ మీడియా ద్వారా 'కౌశల్ ఆర్మీ' సభ్యులు తమ మనసులోని మాటను చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు విలన్ పాత్రల కోసం కౌశల్ ను సంప్రదిస్తున్నారు. విలన్ గా కౌశల్ ఎంట్రీ ఏ హీరోతో ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ తో ఎప్పుడైతే కలిసి నటించే అవకాశం వస్తుందో అప్పుడు గాని ఆయన ముచ్చట తీరదు.   
ntr
pooja

More Telugu News